ముచ్చటగా మూడోసారి..వెంకీమామతో త్రిష!

Tuesday, January 21, 2025

విక్టరీ వెంకటేష్‌ ప్రస్తుతం సక్సెస్‌ సినిమాల డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి కాంబోలో తన కొత్త సినిమాని రూపొందిస్తున్నాడు.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుపుకుంటుంది. ఇక ఈ సినిమాలో అందాల భామలు మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్‌లు హీరోయిన్లుగా చేస్తున్నారు. ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసి సంక్రాంతి బరిలో నిలిపేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.

ఈ క్రమంలోనే తాజాగా వెంకీ నెక్ట్స్ ప్రాజెక్ట్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త సినీ సర్కిల్స్‌లో షికారు చేస్తుంది. వెంకటేష్ తన నెక్ట్స్ చిత్రాన్ని ‘సామ‌జ‌వ‌ర‌గ‌మ‌న‌’ సినిమాతో ర‌చ‌యిత‌గా గుర్తింపు తెచ్చుకొన్న నందుతో తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడంట. ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా ముద్దుగుమ్మ త్రిష నటించబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే త్రిషకు ఈ సినిమా కథ చెప్పడంతో ఆమె ఈ సినిమాలో నటించేందుకు గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.

గతంలో త్రిష వెంకీతో ‘ఆడ‌వారి మాట‌ల‌కు అర్థాలే వేరులే’, ‘న‌మో వెంక‌టేశ‌’ చిత్రాల్లో యాక్ట్‌ చేసింది. దీంతో ఇప్పుడు వీరు ముచ్చటగా మూడోసారి జోడి కట్టనున్నారు. మరి ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఎప్పుడు వస్తుందో వేచి చూడాల్సిందే.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles