ఒక్క హిట్ కోసం!

Friday, December 5, 2025

టాలీవుడ్‌లో వరుసగా కొత్త కంటెంట్‌ను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్న హీరో గోపీచంద్ ఇప్పుడు మరో ఇంట్రస్టింగ్ ప్రాజెక్ట్‌లో నటిస్తున్నాడు. గతంలో విశ్వం సినిమాతో మంచి విజయం అందుకున్న ఆయన, ఇప్పుడు వినూత్న కథలతో పేరు తెచ్చుకున్న దర్శకుడు సంకల్ప్ రెడ్డితో కలిసి పని చేస్తున్నారు. గతంలో ఘాజీ, అంతరిక్షంలాంటి భిన్నమైన సినిమాలు చేసిన సంకల్ప్ – ఇప్పుడు గోపీచంద్‌తో కలిసి ఓ భారీ పీరియాడిక్ డ్రామా తీస్తున్నాడు.

ఇటీవల గోపీచంద్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్‌ తో పాటు చిన్న గ్లింప్స్‌ను కూడా రిలీజ్ చేశారు. ఇందులో గోపీచంద్ పూర్తిగా యుద్ధ వీరుడిలా మార్చిపోయి కనిపించాడు. ఆయుధంతో అగ్రెసివ్ లుక్‌లో కనిపించిన గోపీచంద్ స్టైల్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. గ్లింప్స్‌లో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సింపుల్‌గా ఉన్నా, మంచి ఎఫెక్ట్ సృష్టించింది.

ఈ సినిమాను శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ నిర్మిస్తోంది. భారతదేశ చరిత్రలో చాలామందికి తెలియని కానీ ఆసక్తికరమైన ఒక భాగాన్ని ఆధారంగా చేసుకొని ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఎప్పటిలాగే గోపీచంద్ మరోసారి డిఫరెంట్ జానర్‌లో కనిపించబోతున్నాడు. ఇక సినిమాలోని ఇతర విషయాలపై త్వరలోనే మరిన్ని వివరాలు వెలువడనున్నాయి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles