సత్యదేవ్ తో ఆ సినిమా ఫిక్స్‌!

Wednesday, January 22, 2025

వర్సటైల్ యాక్టర్ సత్యదేవ్ నటించిన  సినిమాలపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్‌ అయ్యాయి. ఆయన నటించే సినిమాల్లో కచ్చితంగా ఆకట్టుకునే అంశం ఉంటుందని అభిమానులు అనుకుంటున్నారు. ఇక ఈ హీరో నటిస్తున్న తాజా సినిమా ‘జీబ్రా’ విడుదలకు సిద్దం అవుతోంది.

నవంబర్ 22న ఈ సినిమాను గ్రాండ్‌గా విడుదల చేసేందుకు మేకర్స్ రెడీ అవుతుండగా.. దర్శకుడు ఈశ్వర్ కార్తీక్ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. ఇక తాజాగా ఈ సినిమా మెగా ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహిస్తున్నారు.

ఈ ఈవెంట్‌కు దర్శకుడు వెంకటేష్ మహా కూడా అతిథిగా వచ్చారు. ఆయన ఈ ఈవెంట్‌లో మాట్లాడుతూ.. సత్యదేవ్ అంటే తనకు ఎంతో ఇష్టమైన నటుడు అని.. ఆయనతో ఇంతకు ముందు కూడా  ఓ సినిమా చేశానని.. త్వరలోనే ఆయనతో మరో సినిమా చేయనున్నట్లు ప్రకటించారు. ఇక ఈ సినిమా ప్రేక్షకులకు సరికొత్త అనుభవాన్ని ఇస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

గతంలో ‘C/O కంచెరపాలెం’, ‘ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య’ వంటి వైవిధ్యమైన సినిమాలను తీర్చిదిద్దిన వెంకటేష్ మహా, ఈసారి సత్యదేవ్‌తో ఎలాంటి సినిమా చేస్తాడో అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా వెయిట్‌ చేస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles