ఏ మాస్టర్‌ పీస్‌ నుంచి ఫస్ట్‌ లుక్‌ విడుదల!

Thursday, December 26, 2024

శుక్ర’, ‘మాటరాని మౌనమిది’ లాంటి  డిఫరెంట్ సినిమాల తర్వాత దర్శకుడు సుకు పూర్వజ్ రూపొందిస్తున్న కొత్త సినిమా ‘ఏ మాస్టర్ పీస్’. ఈ చిత్రంలో  అరవింద్‌ కృష్ణ, జ్యోతి పూర్వాజ్‌ , ఆషు రెడ్డి ప్రధాన పాత్రలు చేస్తున్నారు. ఈ సినిమాని ప్రతిష్టాత్మక ఫిల్మ్‌ ప్రొడక్షన్ స్టూడియో మెర్జ్‌ ఎక్స్‌ ఆర్‌ భాగస్వామిగా నిర్మిస్తుంది. ఈ సినిమాని శ్రీకాంత్‌ కండ్రేగుల నిర్మిస్తున్నారు.

ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు అందిస్తూ మేకర్స్ ఈ అనౌన్స్ మెంట్ చేశారు. మైథాలజీ, సైన్స్ ఫిక్షన్ కలిసిన ఒక న్యూ కాన్సెప్ట్ సూపర్ హీరో మూవీ ఎక్సీపిరియన్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందించబోతున్నామని, అద్భుతమైన విజువల్స్, భారీ మేకింగ్, విజువల్ ఎఫెక్టులతో  ఈ చిత్రం రానుందని మేకర్స్ చెప్పారు.

“భారీ క్లైమాక్స్ మినహా షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసుకుంది. ఈ చిత్రాన్ని ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తుంది. ఈ సినిమా హై స్టాండర్డ్‌ ప్రొడక్షన్‌ వ్యాల్యూస్‌ తో సూపర్‌ యూనిక్‌ హీరో ఫిల్మ్‌ గా ఏ మాస్టర్‌ పీస్‌ ఉండబోతుందాని మూవీ మేకర్స్‌ అంటున్నారు.

ఈ సినిమాలో స్నేహ గుప్త, అర్చనా అనంత్, జయప్రకాశ్, చందు, మనీష్ గిలాడ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles