ఒకే వేదిక పై బాబాయి-అబ్బాయి..ఇక ఫ్యాన్స్‌ కి పండగే!

Wednesday, January 22, 2025

నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా బాబీ డైరెక్షన్‌ లో తెరకెక్కుతున్న తాజా సినిమా డాకు మహారాజ్‌. సితార ఎంటర్‌ టైన్‌మెంట్స్‌ బ్యానర్ పై నాగవంశీ నిర్మిస్తున్న ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన టీజర్ , సాంగ్‌ మంచి రెస్పాన్స్‌ ని అందుకున్నాయి.

విడుదల సమయం దగ్గర పడటంతో మూవీ టీమ్ ప్రమోషన్స్ వేగవంతం చేసింది. ఇందులో భాగంగానే తాజాగా మూవీటీమ్‌  ప్రెస్ మీట్ పెట్టింది. ఇందులో నిర్మాత నాగవంశీ ఈ సినిమాకి సంబంధించి ఈవెంట్స్ ను గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. అంతేకాకుండా ‘డాకు మహారాజ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఆంధ్రాలో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అయితే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు జూనియర్ ఎన్టీఆర్ ను తీసుకువచ్చే ఆలోచనలో ఉన్నారట మూవీ మేకర్స్.

ముఖ్యంగా నాగవంశీ.. ఎలాగైనా తారక్ ను ఈ కార్యక్రమానికి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారట. నాగవంశీతో ఎన్టీఆర్ కు మంచి బాండింగ్ ఉంది. సో అతను అడిగితే తారక్ కాదనడు. అంటే బాబాయ్ ఈవెంట్ కి అబ్బాయి కచ్చితంగా వెళ్లే ఛాన్స్ ఉన్నట్లు ఇండస్ట్రీ సర్కిల్స్ లో టాక్ వినపడుతుంది.

బాలయ్య, ఎన్టీఆర్ ఒకే వేదికపై కనిపించి చాలా కాలం అవుతోంది. నాగవంశీ ప్రయత్నం ఫలిస్తే.. మళ్ళీ నందమూరి హీరోలను ఒకే వేదికపై చూడొచ్చు. అదే జరిగితే ఫ్యాన్స్ కు పండగే అని చెప్పొచ్చు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles