అభిమానుల రిక్వెస్ట్ ఇదే!

Friday, January 17, 2025

నందమూరి నటసింహం బాలయ్య బాబు– డైరెక్టర్  బాబీ కాంబోలో “డాకు మహారాజ్” సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా జనవరి 12, 2025న గ్రాండ్ విడుదలకు రెడీ అవుతుంది. రిలీజ్‌ తేదీ దగ్గర పడుతున్న సమయంలో.. ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ ను వేగవంతం చేయాలని, సినిమా అప్ డేట్స్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అభిమానులు చిత్ర బృందాన్ని కోరుతున్నారు.

ముఖ్యంగా సినిమా పై బజ్‌ని మరింతగా పెంచేలా పాటల విడుదల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని, అన్నిటికంటే ముఖ్యంగా ఈ సినిమా ట్రైలర్‌ విషయంలోనూ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుని, త్వరగా సాలిడ్ ప్రమోషన్స్ ను మొదలు పెట్టాలని అభిమానులు మూవీ మేకర్స్‌ను కోరుతున్నారు.

ఇక ఈ సినిమా నుంచి  తాజాగా వచ్చిన సాలిడ్ టైటిల్ టీజర్ అద్భుతంగా ఉంది. సాంగ్స్ అండ్ ట్రైలర్ కూడా అదే స్థాయిలో ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు. అన్నట్టు ఈ మూవీ కచ్చితంగా బాలయ్య ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ ఇచ్చేలా డైరెక్టర్‌ బాబీ ఈ సినిమాని  రూపొందిస్తున్నారు.

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై నాగ వంశీ, ఫార్చూన్‌ ఫోర్ సినిమాపై సాయి సౌజన్య ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. చాందినీ చౌదరి, ఊర్వశీ రౌతేలా ఈ సినిమాలో కీలక పాత్రల్లో యాక్ట్‌ చేస్తున్నారు. ఇక ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తుండగా బాబీ డియోల్ మరో కీలక పాత్రలో యాక్ట్‌ చేస్తున్న సంగతి తెలిసిందే.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles