అల్లు అర్జున్‌ ఇంటిని ధ్వంసం చేసిన అభిమానులు!

Sunday, December 22, 2024

జాతీయ నటుడు అల్లు అర్జున్‌ తాజాగా నటిస్తున్న చిత్రం పుష్ప 2. ఈ సినిమా షూటింగ్‌ తో బన్నీ ప్రస్తుతం ఫుల్‌ బిజీగా ఉన్నాడు. సుకుమార్‌ బన్నీ కాంబోలో తెరకెక్కిన చిత్రం పుష్ప. ఆ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఆ సినిమాకు సీక్వెల్‌ గా వస్తున్న చిత్రమే పుష్ప 2.

ఈ చిత్రంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తుంది. ‘పుష్ప: ది రైజ్’ కు సీక్వెల్‌గా వస్తున్న ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అంతే కాకుండా ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు వచ్చిన ప్రతి అప్‌డేట్ ఎంతో ఆకట్టుకున్నాయి. ఇక రీసెంట్‌గా వచ్చిన టీజర్ గురించి అయితే స్పెషల్‌గా చెప్పాల్సిన పని లేదు. యూట్యూబ్‌లో కొత్త రికార్డులను క్రియేట్ చేసింది.

ఇదిలా ఉంటే.. తాజాగా అల్లు అర్జున్ ఇంటికి వచ్చిన ఫ్యాన్స్ మొత్తం ఇల్లుతో సహా అక్కడ ఉన్న కొన్ని వస్తువులను ధ్వంసం చేశారు.స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా తన అభిమానులను కలిసేందుకు ఇంటి నుంచి బయటకు వచ్చారు. దీంతో అతడిని చూసేందుకు పెద్ద సంఖ్యలో ఫ్యాన్స్ వచ్చారు. ఈ క్రమంలోనే అక్కడ తొక్కిసలాట, తోపులాట జరిగింది.

ఫలితంగా కొంతమంది వ్యక్తులు తమ బ్యాలెన్స్‌ను కోల్పోయి ఇంటి పారాపెట్ వాల్‌పై ఉన్న విద్యుత్ వైర్లతో సైతం తెంపేశారు. ఇందులో భాగంగా కొన్ని గోడలు కూడా ధ్వంసం అయినట్లు తెలుస్తుంది. అక్కడ పరిస్థితి మరింది ఉధృతంగా మారడంతో అల్లు అర్జున్ లోపలికి వెళ్లిపోయాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles