మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ప్రెస్టీజియస్ చిత్రం ‘విశ్వంభర’ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను దర్శకుడు వశిష్ఠ తెరకెక్కిస్తుండగా పూర్తి సోషియో ఫాంటసీ మూవీగా ప్రేక్షకులను మెస్మరైజ్ చేసేందుకు రెడీ అవుతుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మిక్సిడ్ టాక్ దక్కింది.
దీంతో ఈ సినిమా యూనిట్ ఈ మూవీ విడుదల తేదీని వాయిదా వేశారు. అభిమానులకు అదిరిపోయే విజువల్ ట్రీట్ ఇచ్చేందుకు తాము ప్రయత్నిస్తున్నామని.. అందుకే ఈ సినిమా విడుదల తేదీని వాయిదా వేస్తున్నామని గతంలోనే మేకర్స్ ప్రకటించారు. కానీ, అప్పటి నుంచి ఇప్పటి వరకు ‘విశ్వంభర’ నుంచి మరొక అప్డేట్ రాలేదు.
ఇప్పుడు కొత్త సంవత్సరం కూడా రావడంతో మిగతా చిత్రాలు సందడి చేస్తున్నాయి. ఏదో ఒక అప్డేట్‌తో అభిమానులను పలకరిస్తున్నాయి.కానీ, విశ్వంభర మాత్రం సైలెంట్‌గానే ఉండిపోయాడు. దీంతో మెగా ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. కొత్త సంవత్సరం సందర్భంగా.. లేదంటే సంక్రాంతి సందర్భంగా అయినా, ఏదో ఒక అప్డేట్ ఇస్తే బాగుంటుందని వారు కోరుతున్నారు.
మరి ఇప్పటికైనా ‘విశ్వంభర’ మౌనం వీడుతాడా లేదా అనేది మాత్రం క్లారిటీ లేదు.