ఆ విషయంలో పూర్తి నిరాశలో అభిమానులు!

Monday, December 8, 2025

ప్రభాస్ కథానాయకుడిగా, నిధి అగర్వాల్ మరియు మాళవిక మోహనన్ కథానాయికలుగా మారుతీ తెరకెక్కిస్తున్న చిత్రం ది రాజా సాబ్ మీద కొంతకాలంగా ప్రేక్షకుల్లో ఆసక్తి కొనసాగుతూనే ఉంది. హారర్‌తో పాటు రొమాన్స్ కూడా మిక్స్ అయిన ఎంటర్టైనర్‌గా ఈ సినిమాను రూపొందిస్తున్నారని సమాచారం.

ఈ సినిమాకి సంబంధించి మే నెల మధ్యలో ఒక అప్డేట్ ఇవ్వబోతున్నట్టు దర్శకుడు మారుతీ స్వయంగా వెల్లడించినా, ఆ విషయంపై ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదట. ఈ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ కొద్దిగా నిరుత్సాహానికి లోనవుతున్నారు. ఎందుకంటే సినిమా గురించి కొన్ని రోజులుగా ఏదైనా న్యూస్ వస్తుందన్న అంచనాలు పెరిగిపోతున్నా, ఎటువంటి అధికారిక సమాచారం మాత్రం అందడంలేదు.

ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి టీజర్ ఎప్పుడొస్తుందా, రిలీజ్ డేట్ ఏంటనే దానిపై అభిమానులు ఎదురుచూస్తున్నారు. కానీ ఇప్పటి వరకు ఏ విషయంపైనా క్లారిటీ రాకపోవడం వలన ప్రేక్షకుల్లో ఒక అనుమానాన్ని పెంచుతోంది.

ఈ సినిమాలోకి థమన్ మ్యూజిక్ అందిస్తుండగా, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ బాధ్యతలు చేపట్టింది. ప్రభాస్ అభిమానులు మాత్రం ఏదైనా అప్డేట్ త్వరగా వస్తే బాగుంటుందని ఆశిస్తున్నారు. మరి దానిపై ఎప్పుడు అధికారిక ప్రకటన వస్తుందో చూడాలి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles