ఖరీదైనవే

Thursday, December 26, 2024

హీరోయిన్ సమంత, వరుణ్ ధావన్‌ ముఖ్య పాత్రల్లో నటించిన వెబ్‌ సిరీస్‌ ‘సిటాడెల్‌: హనీ బన్ని’. కాగా అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా నవంబర్‌ 7 నుంచి ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్‌ అవుతుంది. అయితే, ‘సిటడెల్‌ హనీ బన్నీ’ ప్రమోషన్స్‌లో భాగంగా వరుణ్‌ ధావన్‌ తో కలిసి సరదా చిట్‌చాట్‌లో సామ్‌ కూడా పాల్గొంది.

కాగా ఈ ‘స్పైసీ రాపిడ్‌ ఫైర్‌’లో ఎదుటి వ్యక్తి అడిగిన ప్రశ్నకు ఇష్టమైతే సమాధానం చెప్పాలి, లేదంటే పచ్చిమిర్చి తినాల్సిఉంటుంది. ఈ క్రమంలో వరుణ్‌ ధావన్‌ ప్రశ్న అడుగుతూ.. ‘‘అవసరం లేకపోయినా మీరు  దేని కోసం ఎక్కువగా ఖర్చు పెట్టారు?’’ అని ఓ ప్రశ్న సంధించారు.

ఈ ప్రశ్నకు సమంత సమాధానం ఇస్తూ.. ‘నా మాజీకి ఇచ్చిన ఖరీదైన కానుకులు’’ అని సమంత సమాధానం ఇచ్చింది. ‘‘ఎంత ధర ఉంటుంది?’’ అని అడగ్గా.. ‘‘కాస్త ఎక్కువే.. ఇక కొనసాగిద్దాం’’ అంటూ సమంత ఈ టాపిక్ ను ముగించింది. సమంత చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. స్పై, యాక్షన్‌ థ్రిల్లర్ గా ఈ ‘సిటడెల్‌: హనీ బన్నీ’ సిరీస్ ను రాజ్‌ అండే డీకే దీనిని రూపొందించారు. ఈ సిరీస్‌ ప్రపంచవ్యాప్తంగా 200 దేశాల్లో ప్రసారమతున్న సంగతి తెలిసిందే. 150 దేశాల్లో టాప్‌లో ఉంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles