కల్కి ట్రైలర్‌ పై పెరుగతున్న భారీ అంచనాలు!

Wednesday, January 22, 2025

 టాలీవుడ్‌ స్టార్‌ హీరో ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం “కల్కి 2898 ఏడీ “. ఈ సినిమాను మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ తీర్చి దిద్దుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో అమితాబ్ ,కమల్ వంటి లెజెండరీ యాక్టర్స్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన బాలీవుడ్‌ భామలు దీపికా పదుకోన్ ,దిశా పటాని హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

ఈ సినిమాను మేకర్స్ జూన్ 27 న గ్రాండ్ గా విడుదల చేయనున్నారు.అయితే ఈ సినిమా విడుదల  తేదీ దగ్గరపడుతుండటంతో మేకర్స్ ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచారు. ఈ సినిమాలో స్పెషల్ క్యారెక్టర్ అయిన “బుజ్జి”ని మేకర్స్ ఎంతో గ్రాండ్ గా పరిచయం చేసారు.బుజ్జి అంటే ఓ రోబోటిక్ కార్.. ఈ సినిమాలో బుజ్జి ప్రభాస్ కు బెస్ట్ ఫ్రెండ్..సినిమాలో బుజ్జి పాత్ర ఎంతో కీలకమని దర్శకుడు నాగ అశ్విన్ తెలిపారు.

ఈ బుజ్జికి నటి కీర్తి సురేష్ డబ్బింగ్ చెప్పిన విషయం తెలిసిందే.  ఇదిలా ఉంటే మేకర్స్ ఈ చిత్ర ట్రైలర్ రిలీజ్ పై కీలక అప్డేట్ ఇచ్చారు.ఈ చిత్ర ట్రైలర్ జూన్ 10 న గ్రాండ్ గా   విడుదల చేయనున్నారు. దీంతో ట్రైలర్ పై ప్రేక్షకులలో భారీ అంచనాలే వున్నాయి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles