మాస్‌ మహారాజా అభిమానులకు అదిరిపోయే వార్త!

Wednesday, January 22, 2025

మాస్‌ మహారాజ్‌ రవితేజ ఈ ఏడాది ఇంకా హిట్‌ కొట్టలేదు. అయినప్పటికీ వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. రవితేజ తాజాగా మిస్టర్ బచ్చన్ సినిమాని చేస్తున్నాడు. ఈ సినిమాని మాస్‌ డైరెక్టర్‌ హరీష్‌ శంకర్‌ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో రవితేజ సరసన భాగ్యశ్రీ బోర్స్ హీరోయిన్ గా నటిస్తుంది.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది.ఈ సినిమా తరువాత రవితేజ దర్శకుడు అనుదీప్ కేవి తో ఓ సినిమా చేయనున్నాడు. అలాగే సామజవరగమన మూవీ రైటర్ గా  వర్క్ చేసిన భాను బోగవరపుతో రవితేజ ఓ సినిమా చేయనున్నాడు. రవితేజ ఎనర్జీకి మ్యాచ్ అయ్యేలా దర్శకుడు భాను బోగవరపు అదిరిపోయే స్టోరీ సిద్ధం చేశాడంట. ఈ సినిమా షెడ్యూల్ త్వరలోనే మొదలు కానుంది.ఈ సినిమా రవితేజ సినీ కెరీర్ లో 75 వ మూవీగా తెరకెక్కుతుంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles