టాలీవుడ్‌లో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్న తాజా సినిమాల్లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటిస్తున్న “కిష్కింధపూరి” కూడా ఒకటి. దర్శకుడు కౌశిక్ పగళ్ళపూడి ఈ చిత్రాన్ని థ్రిల్లర్ జానర్‌లో తెరకెక్కిస్తుండగా, ట్రైలర్ విడుదలైన తర్వాత సినిమా మీద అంచనాలు మరింత పెరిగాయి. సాయి శ్రీను సరసన హీరోయిన్‌గా అనుపమ పరమేశ్వరన్ నటిస్తుండటం ఇప్పటికే హైలైట్‌గా మారింది.
ఇక ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కి కూడా అనుపమ హాజరైంది. అయితే ఈ సందర్భంగా ఆమె ప్రస్తుతం జ్వరంతో ఇబ్బంది పడుతున్న విషయాన్ని బయటపెట్టింది. ఆరోగ్యం బాగోలేకపోయినా, సినిమా ప్రమోషన్ కోసం తాను తప్పక రావాలని నిర్ణయించుకున్నానని చెప్పింది. తన చిత్రంపై ఇంత డెడికేషన్ చూపించడం ఆమె అభిమానుల్లో మంచి చర్చనీయాంశంగా మారింది.
