పెళ్లప్పుడే.. పెళ్లి అయ్యాక కూడా!

Sunday, December 22, 2024

హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ సినిమాల్లో చేస్తూ బిజీగా ఉంది వరలక్ష్మి శరత్‌ కుమార్. వరలక్ష్మి ప్రధాన పాత్రధారిగా నటిస్తున్న చిత్రం శబరి. ఈ చిత్రాన్ని మహేంద్రనాథ్‌ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీని పాన్‌ ఇండియా సినిమాగా రూపుదిద్దుతున్నారు.  ఈ చిత్రానికీ సంబంధించిన ట్రైలర్‌ ను కొద్ది రోజుల క్రితమే ఆవిష్కరించారు.

ఈ సినిమా గురించి నటి వరలక్ష్మి శరత్ కుమార్ మాట్లాడుతూ..తను జీవితంలో పెళ్లి చేసుకోవాలని అనుకోలేదని.. పెళ్లి అనేది నా లైఫ్ లో సర్ప్రైజ్ అంటూ తెలిపింది. అసలు నేను పెళ్లి చేసుకోవాలని ఎప్పుడూ అనుకోలేదు.. కానీ ఇప్పుడు పెళ్లి చేసుకుంటున్నానని చెప్పుకొచ్చింది. అలా నా జీవితంలో తెలియని సంఘటన జరిగిపోతుందంటూ చెప్పుకొచ్చింది.

ఇంతకంటే నా లైఫ్ లో ఆశ్చర్యకరమైన విషయం మరొకటి ఉండదని ఆవిడ తెలిపారు. ఇకపోతే పెళ్లి చేసుకున్న తర్వాత కూడా తన కెరియర్ ను తాను ఖచ్చితంగా కొనసాగిస్తానని చెప్పుకొచ్చింది.సినీ పరిశ్రమంలో తాను దూరంగా ఉండనని.. తన ఎంగేజ్మెంట్ జరిగిన మరుసటి రోజే షూటింగ్ కు వచ్చానని నాకు సినిమా పట్ల నాకున్న కమిట్మెంట్ అదే అంటూ తెలిపింది. కాకపోతే నిశ్చితార్థం  జరిగిన విషయం అందరికీ తెలిసిందే.. ఇంకా పెళ్లి డేట్ ఫిక్స్ కాలేదు అంటూ చెప్పుకొచ్చింది.

అయితే పెళ్లి మాత్రం ఈ సంవత్సరం లోనే  జరుగుతుందంటూ ఆవిడ చెబుతూనే.. ఒకవేళ పెళ్లి డేట్ ఫిక్స్ అయితే మాత్రం కచ్చితంగా మీడియాకు అధికారికంగా తెలుపుతానని చెప్పుకొచ్చింది. అప్పటివరకు ఎలాంటి సమాచారం నా వద్ద దొరకదు అంటూ డైరెక్ట్ గా చెప్పేసింది. 

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles