మరోసారి కలిసిన ఎటో వెళ్లిపోయింది మనసు జోడి!

Wednesday, January 22, 2025

నేచురల్ స్టార్ నాని, టాలీవుడ్ బ్యూటీ సమంత హీరో హీరోయిన్లుగా 2012లో వచ్చిన చిత్రం ‘ఎటో వెళ్ళిపోయింది మనసు’. ఈ సినిమాని తమిళ దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ డైరెక్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా నాని సామ్ జోడి ప్రేక్షకులను విశేషంగా అలరించింది. చాలా కాలం తర్వాత ఈ సూపర్ హిట్ జోడి మరోసారి అనుకోకుండా కలిసింది.

ప్రస్తుతం నాని సరిపోదా శనివారం అనే సినిమాలో యాక్ట్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 29న వరల్డ్ వైడ్ గా విడుదల కానుంది. ఈ చిత్ర ప్రమోషన్స్ లో నేచురల్ స్టార్ ఫుల్ బిజీ బిజీగా ఉన్నాడు. ఇటీవల చెన్నై లో ఈ చిత్ర ప్రమోషన్స్ లో పాల్గొని అక్కడి మీడియాతో ముచ్చటించారు.

పాన్ ఇండియా భాషల్లో రానున్న సరిపోదా శనివారం హిందీ ప్రమోషన్స్ కోసం హైదరాబాద్ నుండి ముంబై వెళుతుండగా ఎయిర్ పోర్ట్ లో సమంతని  అనుకోకుండా కలిసాడు నేచురల్‌ స్టార్‌ నాని. అనుకోకుండా జరిగిన ఈ కలయికను హీరోయిన్ సమంత తన ఫోన్ లో క్లిక్ మనిపించించి ఇన్ స్టాగ్రామ్ లో స్వీటెస్ట్ సర్పైజ్ టుడే అంటూ నానిని ట్యాగ్ చేసింది. దీంతో ప్రస్తుతం ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ గా మారింది.

అయితే నెటిజన్స్ మళ్ళి వీరిద్దరి కాంబోలో మరో సినిమా వస్తే బాగుంటుందని ఎటో వెళ్ళిపోయింది మనసు -2 చేస్తే సూపర్ హిట్ అవుతుందని కామెంట్స్ పెడుతున్నారు. ఇటు నాని వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు, అటు సామ్ పలు వెబ్ సిరీస్ లతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles