మహేష్‌ కి ఈడీ నోటీసులు!

Friday, December 5, 2025

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకి ED నోటీసులు ఇవ్వడం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది ఓ రియల్ ఎస్టేట్ సంస్థకు చెందిన ప్రమోషన్స్ చేయడంతో మహేష్ బాబుకి ఈడీ నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది.

సురానా గ్రూప్, సాయి సూర్య డెవలపర్స్ సంస్థలు వినియోగదారులను మోసం చేసినట్లు ఈడీ అధికారులు తెలిపారు. సదరు సంస్థలకు సంబంధించిన యాడ్స్ కోసం మహేష్ రూ.5.9 కోట్లు తీసుకున్నారని… అందులో రూ.3.4 కోట్లు చెక్ రూపంలో, మిగతాది నగదు రూపంలో అందుకున్నట్లు సమాచారం.

ఈ లావాదేవీల వ్యవహారంలో ఈడీ ఆయనకు నోటీసులు జారీ చేసింది. దీంతో ఈ నెల 27న మహేష్ బాబు విచారణకు హాజరుకావాలని ఈడీ పేర్కొంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles