దుమ్మురేపిన డబుల్ ఇస్మార్ట్‌ స్టెప్ మార్‌…!

Saturday, April 5, 2025

టాలీవుడ్‌ యంగ్‌ అండ్‌ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని నటిస్తున్న తాజా చిత్రం డబుల్ ఇస్మార్ట్ . పక్కా మాస్ కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాకి పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. యంగ్ బ్యూటీ కావ్య థాపర్ ఇందులో హీరోయిన్ గా  నటించగా.. సంజయ్ దత్, బన్ని జె, అలీ, గెటప్ శ్రీను, షాయాజీ షిండే, మకరంద్ దేశ్‌పాండే, టెంపర్ వంశీ లాంటి వారు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవలే విడుదలైన మూవీ టీజట్ సూపర్ రెస్పాన్స్ సొంతం చేసుకోగా.. తాజాగా మరో అదిరిపోయే అప్డేట్ ని మూవీ మేకర్స్ విడుదల చేశారు.

తాజాగా ఈ మూవీ ఫస్ట్ సింగల్ ‘స్టెప్‌ మార్’ మాస్ బీట్ సాంగ్ ప్రోమోను విడుదల చేశారు మేకర్స్. పాటలో మాస్ స్టెప్స్ తో రామ్ దుమ్ములేపుతున్నాడు. ఫుల్ ఫుల్ సాంగ్ జులై 1న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం తెలిపింది. ప్రస్తుతం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో ఈ సినిమా టైటిల్ సాంగ్‌‌‌‌‌‌‌‌  చేస్తున్నారు. దీనికి జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రం ఆగస్టు 15న విడుదల కానుంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : admin@andhrawatch.com

Latest Articles