భారీ బడ్జెట్‌ తో రూపుదిద్దుకుంటున్న దసరా 2!

Friday, September 27, 2024

నేచురల్ స్టార్ నాని హీరోగా, శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్‌ లో వచ్చిన దసరా ఘన విజయం అందుకున్న సంగతి తెలిసిందే. తెలంగాణ నేపథ్యంలో సాగే కథాంశంతో తెరకెక్కిన ఈ  సినిమా నాని కెరీర్ లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. పక్కా మాస్ మసాలా ఫార్ములాతో ఈ సినిమాని తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు దర్శకుడు శ్రీకాంత్ ఓదెల. శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి దసరా చిత్రాన్ని దాదాపు రూ .75 కోట్లతో నిర్మించిన సంగతి తెలిసిందే.

దాదాపు సంవత్సరం తర్వాత దసరా కు సీక్వెల్ ప్రకటించాడు దర్శకుడు శ్రీకాంత్ ఓదెల. దసరాకు తెలంగాణ, ఓ ఇద్దరు స్నేహితుల మధ్య సాగే కథను ఎంచుకున్న దర్శకుడు, సీక్వెల్ కు సికింద్రాబాద్ నేపథ్యంలో జరిగే కథను ఎంచుకున్నట్లు సమాచారం. అందుకోసం భారీ సెట్లు, భారీ టెక్నిషియన్స్ పని చేస్తున్నట్లు సమాచారం.  కానీ మొదటి భాగానికి రెండవ భాగానికి సంబంధం ఉండదని కేవలం సోల్ ని మాత్రమే తీసుకుని మిగిలిన స్టోరీ మొత్తాన్ని సరికొత్తగా రెడీ చేసినట్టు సమాచారం.

నాని ప్రస్తుతం సరిపోదా శనివారం అనే సినిమా లో యాక్ట్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. వచ్చేనెల 29న ఈ  సినిమా థియేటర్లలో విడుదల కానుంది. దసరా – 2ను జనవరి లేదా ఫిబ్రవరి నుండి మొదలెట్టే ఆలోచన చేస్తున్నాడు నాని. ఈ చిత్రంలో నానికి జోడీగా బాలీవుడ్ అందాల రాసి జాన్వీ కపూర్ ను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది.

దీనిపై అధికారకంగా ప్రకటన రావాల్సి ఉంది. మొదటి భాగానికి సంగీతం అందించిన సంతోష్ నారాయణ్ ఈ చిత్రం నుండి తప్పుకున్నట్లు సమాచారం. ఈ సీక్వెల్ ను దాదాపు రూ.120 నుండి రూ. 150 కోట్ల బడ్జెట్ తో సుధాకర్ నిర్మించనున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles