ఓటీటీలోకి డ్యూడ్‌ ఎప్పుడంటే..!

Thursday, December 4, 2025

దీపావళి సీజన్‌లో టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర పలు సినిమాలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. వాటిలో హీరో ప్రదీప్ రంగనాథన్ నటించిన డ్యూడ్ చిత్రం కూడా ఒకటి. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ సినిమా మంచి హైప్‌తో థియేటర్లలో మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. ముఖ్యంగా యువతను ఈ సినిమా బాగా ఆకట్టుకుంటోంది.

దర్శకుడు కీర్తిశ్వరన్ తెరకెక్కించిన తీరు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకుంటోంది. కథా ప్రదర్శన, మ్యూజిక్, ఎమోషనల్ కనెక్ట్ – అన్ని అంశాలు ప్రేక్షకులను థియేటర్‌లో ఎంగేజ్ చేస్తున్నాయి.

ఇక ఈ సినిమా థియేటర్లలో సక్సెస్‌ఫుల్ రన్ కొనసాగిస్తూనే ఓటీటీ రిలీజ్‌పై కూడా చర్చలు జోరుగా సాగుతున్నాయి. సినీ వర్గాల సమాచారం ప్రకారం, డ్యూడ్ సినిమా డిజిటల్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ భారీ మొత్తానికి కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా నవంబర్ 14న ఈ సినిమాను ఓటీటీలో స్ట్రీమ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

అంతేకాక, నెట్‌ఫ్లిక్స్ ఈ చిత్రాన్ని తెలుగు మాత్రమే కాకుండా తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో కూడా విడుదల చేయడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles