సాలిడ్ స్టార్ట్ తో ‘డ్యూడ్

Monday, December 8, 2025

కోలీవుడ్ లో వేగంగా ఎదుగుతున్న యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్ నటిస్తున్న తాజా సినిమా “డ్యూడ్” ప్రస్తుతం మంచి క్రేజ్ ని సొంతం చేసుకుంది. ఈ సినిమాకు హీరోయిన్ లుగా మమిత బైజు, నేహా శెట్టి నటిస్తుండగా, దర్శకుడు కీర్తిశ్వరన్ దీన్ని పూర్తిగా యూత్ అండ్ ఫన్ ఎంటర్టైనర్ గా రూపొందించారు. తమిళ్ తో పాటు తెలుగులో కూడా ఈ సినిమా పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

అమెరికా మార్కెట్ లో మాత్రం ఈ చిత్రం రిలీజ్ కి ముందు నుంచే పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేసింది. అక్కడ ప్రీ సేల్స్ ద్వారానే ఈ సినిమా లక్ష డాలర్లకు పైగా గ్రాస్ సాధించడం ట్రేడ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ అయింది. ఈ స్థాయిలో స్టార్ట్ రావడం సినిమా టీంకి పెద్ద బూస్ట్ గా మారింది.

సాయి అభ్యంకర్ సంగీతం సమకూర్చిన ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఇక దీపావళి సందర్భంగా అక్టోబర్ 17న “డ్యూడ్” థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కానుంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles