ఓటీటీ లోకి వచ్చేస్తున్న డ్రాగన్! ఇటీవల తమిళ చిత్రం నుంచి వచ్చి సూపర్ హిట్ అయ్యిన చిత్రాల్లో లవ్ టుడే ఫేమ్ యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్ హీరోగా దర్శకుడు అశ్వత్ మారిముత్తు తెరకెక్కించిన సూపర్ హిట్ చిత్రం “డ్రాగన్” కూడా ఒకటి. మరి అనుపమ పరమేశ్వరన్ సహా కయదు లోహర్ లు నటించిన ఈ చిత్రం వారి కెరీర్లో మంచి హిట్ గా అందుకున్నారు.
ఇక థియేటర్స్ లో సాలిడ్ వసూళ్లు అందుకున్న ఈ చిత్రం ఇపుడు ఫైనల్ గా ఓటిటి రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకుంది. ఈ చిత్రాన్ని దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకోగా అందులో ఈ చిత్రం ఈ మార్చ్ 21 నుంచి పాన్ ఇండియా భాషల్లో అందుబాటులోకి వస్తున్నట్టుగా నెట్ ఫ్లిక్స్ వారు అనౌన్స్ చేసేసారు. సో అప్పుడు ఈ సినిమాని ఎవరైనా మిస్ అయితే ఇపుడు నెట్ ఫ్లిక్స్ లో చూడవచ్చు. ఇక ఈ చిత్రానికి లియోన్ జేమ్స్ సంగీతం అందించిన ఏజిఎస్ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.