కోలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో ప్రదీప్ రంగనాథన్ హీరోగా అనుపమ పరమేశ్వరన్ అలాగే కయదు లోహర్ లు హీరోయిన్స్ గా డైరెక్టర్ అశ్వత్ మారిముత్తు తెరకెక్కించిన భారీ హిట్ సినిమా “డ్రాగన్”.
అయితే ఈ సినిమా తెలుగులో రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ పేరిట విడుదల అయ్యి ఇక్కడ కూడా సినిమా మంచి హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఇక ఫైనల్ గా ఈ సినిమా ఓటీటీలో విడుదలకి వచ్చేసింది.
ఈ సినిమా ఓటీటీ హక్కులు దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. మరి ఈ సినిమా ఇందులో ఈరోజు నుంచి ఎట్టకేలకు అలరించేందుకు వచ్చేసింది. తమిళ్, హిందీలో డ్రాగన్ గా తెలుగు సహా ఇతర ముఖ్య సౌత్ భాషల్లో రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.