యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా, దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో రాబోతున్న కొత్త సినిమా పై రోజుకొక వార్త వినిపిస్తోంది. ఈ మూవీ అప్‌డేట్స్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా వేచి చూస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన మరో ఆసక్తికరమైన టాక్ బయటికి వచ్చింది. ఇందులో ప్రత్యేకంగా ఓ క్యారెక్టర్‌ను డిజైన్ చేస్తున్నారని, ఆ పాత్రను హిందీ వెర్షన్‌లో ఒక బాలీవుడ్ హీరోతో, తమిళ వెర్షన్‌లో ఒక కోలీవుడ్ స్టార్‌తో చేయించాలని మేకర్స్ ఆలోచిస్తున్నారని సమాచారం. మరి ఆ హీరోలు ఎవరో తెలుసుకోవడానికి ఫ్యాన్స్ కూడా ఎదురుచూస్తున్నారు.
ఇక టైటిల్ విషయానికి వస్తే, ఈ సినిమాను ‘డ్రాగన్’ అనే పేరుతో ప్లాన్ చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ ప్రాజెక్ట్ ఎన్టీఆర్ కెరీర్‌లోనే అత్యంత గ్రాండ్ సినిమా కావాలని ప్రశాంత్ నీల్ కసరత్తు చేస్తున్నాడట. అందుకే ఆయన స్క్రిప్ట్ పనికి ఎక్కువ సమయం కేటాయించారని, ఇంతవరకు తన చేసిన సినిమాలన్నింటికంటే ఇది ప్రత్యేకంగా ఉండబోతుందని టాక్.
