నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా ప్రగ్యా జైస్వాల్ అలాగే ఉర్వశి రౌతేలా హీరోయిన్ గా దర్శకుడు కొల్లి బాబీ తెరకెక్కించిన అవైటెడ్ హిట్ చిత్రం “డాకు మహారాజ్” కోసం అందరికీ తెలిసిందే. అత్యున్నత ప్రమాణ విలువలు అలాగే క్రేజీ ఎలివేషన్స్ తో సాగే ఈ హై వోల్టేజ్ యాక్షన్ డ్రామా థియేటర్స్ తర్వాత ఓటిటిలో కూడా రీసెంట్ గానే రిలీజ్ కి వచ్చింది.
దిగ్గజ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో పాన్ ఇండియా ఎంట్రీ ఇచ్చిన ఈ చిత్రం రెండు వారాల్లో సాలిడ్ రెస్పాన్స్ ని అందులో అందుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే మొదటి వారం కంటే రెండో వారం లోనే డాకు మహారాజ్ రెస్పాన్స్ మరింత ఎక్కువ వచ్చినట్టుగా తెలుస్తుంది. మొదటి వారం నెట్ ఫ్లిక్స్ లో 2.4 మిలియన్ కి పైగా న్యూస్ అందుకుంటే రెండో వారంలో దీనికి మించి 2.6 మిలియన్ వ్యూస్ ని అందుకున్నట్టుగా తెలుస్తుంది.
దీనితో ఈ రెండు వారాల్లో 5 మిలియన్ కి పైగా వ్యూస్ ని డాకు మహారాజ్ రాబట్టడం విశేషం. ఇక ఈ చిత్రం ఇప్పటికీ ఇండియా వైడ్ సహా ఇతర పలు దేశాల్లో టాప్ లో ట్రెండింగ్ లో దూసుకెళ్తుంది. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించగా సితార ఎంటర్టైన్మెంట్స్ మరియు ఫార్చూన్ ఫోర్ సినిమాస్ వారు నిర్మాణం వహించారు.