బిగిల్ అలాగే జాను లాంటి చిత్రాల్లో మంచి పాత్రల్లో కనిపించి మెప్పించిన యంగ్ అండ్ టాలెంటెడ్ యాక్టర్ వర్ష బొల్లమ్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ఈ యువ నటి ఐపీఎల్ టీం లలో తన హోమ్ జట్టు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకి సపోర్ట్ గా ఎన్నో పోస్ట్ లు పెడుతుండేది.
ఇక లేటెస్ట్ గా శుక్రవారం జరిగిన మ్యాచ్ లో చెన్నైపై 17 ఏళ్ళు తర్వాత సాధించిన విజయాన్ని ఈమె ఎంతో ఆనందంగా సెలబ్రెట్ చేసుకుంది. అయితే ఈ మ్యాచ్ తర్వాత ఒక ప్లేయర్ ని పొగుడుతూ ఇంకొకరించి కించ పరిచేలా ఉండడం అనేది సోషల్ మీడియాలో రచ్చ నడుస్తుంది. ఇక దీనిపైనే అన్నట్టుగా ఈమె పెట్టిన పోస్ట్ కూడా వైరల్ అవుతుంది.
ఎప్పుడూ ఒకరిని ఎక్కువ చేయడానికి మరొకరిని ఎప్పుడూ కించపరచకూడదు అని చెబుతుంది వర్ష. పోటీ ఎప్పుడు కూడా ఫన్ గానే ఉండాలి… ఫన్ గానే తీసుకోవాలి తప్పితే ఒకరిని పొగడటం కోసం మరొకరిని తగ్గించడం సరికాదు అని లాస్ట్ లో చిన్న పంచ్ కూడా ఇచ్చింది. ఎప్పుడూ మర్చిపోవద్దు వాళ్ళు ఎప్పుడూ మెన్ ఇన్ బ్లూ మాత్రమే రెడ్, ఎల్లో జెర్సీలు మాత్రం కాదు అంటూ అదిరే కౌంటర్ వేసింది. దీంతో ఈ పోస్ట్ ఈ యంగ్ హీరోయిన్ పై వైరల్ అవుతుంది.