జీవితంలో ఆ పని అసలు చేయోద్దంది!

Wednesday, December 25, 2024

బాలీవుడ్‌ ముద్దుగుమ్మలో ఒకరైన అతిలోక సుందరి పెద్ద కుమార్తె జాన్వీ కపూర్‌ ఒకరు.  జీవితంలో ఆ విషయం మాత్రం అసలు చేయవద్దని తన తల్లి సలహా ఇచ్చిందని ఆ విషయాన్ని తాను గట్టిగా ఫాలో అవుతానని జాన్వీ చెప్పుకొచ్చింది. జాన్వీ కపూర్ శ్రీదేవి కుమార్తెగా సినీ రంగ ప్రవేశం చేసిన ఆమె ఇప్పుడు తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ తెచ్చుకునే పనిలో ఫుల్‌ బిజీగా ఉంది.

ఒక పక్క బాలీవుడ్ లో ప్రయోగాత్మక సినిమాలు చేసి చేతులు కాల్చుకుంటూనే ఏకంగా తెలుగులో రెండు బడా ప్రాజెక్టులను తన ఖాతాలో వేసుకుంది. జూనియర్ ఎన్టీఆర్ సరసన దేవర సినిమాతో పాటు రామ్ చరణ్ సరసన ఉప్పెన ఫేం బుచ్చిబాబు  సినిమాలో కూడా నటిస్తోంది. ఆమె నటించిన ఉలఝ్‌  సినిమా తాజాగా హిందీలో విడుదల అయింది. ఈ సినిమా ప్రమోషన్స్ సమయంలో ఆమె కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేయడంతో ప్రస్తుతం ఆ వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌ గా మారాయి. అదేంటంటే ఈ సినిమాలో ఓ పాత్ర కోసం జుట్టు కట్ చేసుకుని కనపడాలని డైరెక్టర్‌ అడిగారని అయితే అది ససేమిరా చేయలేనని చెప్పానని చెప్పుకొచ్చింది.

ఒకవేళ ఆ పాత్ర నా జీవితాన్ని మార్చేసేది అయినా.. లైఫ్ టైం ఆపర్చునిటీ అని నేను భావించినప్పటికీ కూడా నేను జుట్టు కట్ చేసుకోవడానికి లేదా గుండు చేయించుకోవడానికి అసలు ఏమాత్రం ఇష్టపడను. వీఎఫ్ఎక్స్ వాడుతారు కదా అంటూ ఆమె చెప్పుకొచ్చింది. అలా చేయడానికి కారణం తన తల్లి చెప్పిన సలహానే అని ఆమె వివరించింది.

తన మొదటి సినిమా దడక్ చేస్తున్న సమయంలో జుట్టు కట్ చేసుకోవాల్సి వచ్చిందని అప్పుడు తన తల్లి చాలా కోప్పడి బాధ పడిందని చెప్పుకొచ్చింది. నన్ను ఇదంతా ఎలా చేశావు? ఇంకెప్పుడు ఏ పాత్ర కోసం జుట్టు కట్ చేసుకోకు అని సలహా ఇచ్చిందని ఆమె వివరించింది. అలాగే ధడక్ సినిమా షూటింగ్ జరుగుతున్న నాలుగైదు రోజులకి తన తలకు ఆయిల్ పెట్టించి మసాజ్ చేయించేదని నా జుట్టు చూసే మురిసిపోయేదని తెలిపింది. కాబట్టే నేను హెయిర్ కట్ చేయించుకోనని క్లియర్ గా చెప్పేస్తానని ఆమె చెప్పుకొచ్చింది. తన తల్లి తనకు చెప్పిన స్ట్రిక్ట్ అడ్వైజ్ కావడంతో దాన్ని కచ్చితంగా ఫాలో అవుతానని ఆమె వివరించింది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles