చాణక్య వర్మగా ప్రియదర్శి..ఎందులోనో తెలుసా..?

Andhrawatch
1 Min Read

టాలీవుడ్‌ లో కమెడియన్‌ గా ఎంటర్‌ అయ్యి..తరువాత హీరోగా మారిన వారు చాలామందే ఉన్నారు. ఆ కోవలోకి యంగ్‌ కమెడియెన్‌ ప్రియదర్శి కూడా వస్తారు. టాలీవుడ్‌ లో తన అందం, నటనతో యూత్‌ లో మంచి క్రేజ్‌ తెచ్చుకున్న మలయాళ బ్యూటీ నివేదా థామస్‌..చాలా గ్యాప్‌ తరువాత 35-చిన్న కథ కాదు అనే సినిమాతో వస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ ఇప్పటికే షూటింగ్ పనులు అన్ని ముగించుకుని విడుదలకు సిద్దమైంది. ఇక ఈ సినిమాలో ఓ మధ్యతరగతి గృహిణి పాత్రలో నివేదా నటిస్తుండటంతో ఆమె అభిమానులు ఈ సినిమాను చూసేందుకు ఎంతో ఆసక్తిగా ఉన్నారు.

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్, వీడియో గ్లింప్స్‌లు ఈ సినిమాపై పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేశాయి. ఇక ఈ సినిమాలో నటుడు ప్రియదర్శి ఓ ముఖ్యపాత్రలో యాక్ట్‌ చేస్తున్నాడు. ఈ సినిమాలో ఆయన చాణక్య వర్మ అనే ఉపాధ్యాయుడి పాత్రలో యాక్ట్‌ చేస్తున్నాడు. ఆయన పాత్రకు సంబంధించి తాజాగా ఓ వీడియో గ్లింప్స్‌ను తాజాగా మూవీ మేకర్స్ విడుదల చేశారు. మరోసారి ఆయన తన నటనతో ఈ సినిమాకు మేజర్ అసెట్‌గా మారనున్నట్లు ఈ గ్లింప్స్ చూస్తే తెలిసిపోతుంది.

ఇక ఈ సినిమాను హీరో రానా దగ్గుబాటి ప్రొడ్యూస్ చేస్తుండగా, నంద కిషోర్ ఈమని దర్శకత్వ బాధ్యతలు వహిస్తున్నాడు. ఈ సినిమాలో విశ్వదేవ్ రాచకొండ, గౌతమి, భాగ్యరాజ్, కృష్ణతేజ, అరుణ్ దేవ్, అభయ్, అనన్య  ఇతర ముఖ్య పాత్రల్లో యాక్ట్‌ చేశారు. విఈ సినిమాను ఆగస్టు 15న థియేటటర్లలోకి తీసుకుని వచ్చేందుకు చిత్ర బృందం రెడీ అవుతుంది.

Share This Article