టాలీవుడ్‌లో యువ హీరో తేజ సజ్జ నటిస్తున్న కొత్త సినిమా “మిరాయ్”పై మంచి బజ్ నడుస్తోంది. దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని ఈ సినిమాను రూపొందిస్తుండగా, హాలీవుడ్ స్థాయి యాక్షన్ సన్నివేశాలతో ప్రేక్షకులకు కొత్త అనుభూతి ఇవ్వబోతున్నారని మేకర్స్ చెబుతున్నారు. మొదట ప్రకటించిన తేదీ నుంచి వారం రోజుల గ్యాప్ తీసుకుని, తాజాగా కొత్త రిలీజ్ డేట్‌ను ఫిక్స్ చేశారు. ఈ చిత్రాన్ని థియేటర్స్‌లో మాత్రమే కాకుండా పాన్ ఇండియా భాషలతో పాటు కొన్ని అంతర్జాతీయ భాషల్లో కూడా విడుదల చేయాలని టీమ్ ఇప్పటికే ప్రకటించింది.
ఇక థియేట్రికల్ రన్ తర్వాత డిజిటల్ ప్లాట్‌ఫార్మ్‌లో ఎక్కడ చూడవచ్చనే క్లారిటీ కూడా బయటకొచ్చింది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను జియో హాట్‌స్టార్ దక్కించుకోగా, టెలివిజన్ రైట్స్ మాత్రం స్టార్ నెట్‌వర్క్‌కు వెళ్లాయి. అంటే థియేటర్స్‌లో ప్రదర్శనలు పూర్తయ్యాక, ప్రేక్షకులు “మిరాయ్”ని ఈ రెండు ప్లాట్‌ఫార్మ్స్‌లో ఆస్వాదించవచ్చు.
