పెద్ది’ ఫస్ట్ షాట్ వెనక ఎవరో తెలుసా!

Monday, December 8, 2025

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పెద్ది’ ఇప్పటికే ఎలాంటి అంచనాలు క్రియేట్ చేసిందో మనం చూశాం. ఈ సినిమాను దర్శకుడు బుచ్చిబాబు సానా డైరెక్ట్ చేస్తుండగా రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇక ఈ సినిమా నుంచి ఇటీవల రిలీజ్ అయిన ఫస్ట్ షాట్ గ్లింప్స్‌కు సాలిడ్ రెస్పాన్స్ దక్కింది.

అయితే, ఈ ఫస్ట్ షాట్ గ్లింప్స్‌లో రామ్ చరణ్ క్రికెట్ ఆడే ఓ షాట్ బాగా వైరల్ అయ్యింది. సోషల్ మీడియాలో ఆ షాట్‌కు అభిమానుల నుంచి మంచి క్రేజ్ దక్కింది. దీంతో అసలు ఈ వైరల్ షాట్‌ను ఎవరు డిజైన్ చేశారా అని అందరూ అడుగుతున్నారు. తాజాగా దీనిపై దర్శకుడు బుచ్చిబాబు సానా క్లారిటీ ఇచ్చాడు. ఈ షాట్‌ను డిజైన్ చేసింది యాక్షన్ కొరియోగ్రాఫర్ నవకాంత్. ఆయన గతంలో పుష్ప-2 లోని జాతర సీక్వెన్స్‌ను కంపోజ్ చేశారు.

ఇప్పుడు పెద్ది సినిమాలో ఆయన తనదైన మార్క్‌తో కంపోజ్ చేసిన క్రికెట్ షాట్ కూడా బాగా వైరల్ కావడంతో, ఈ సినిమాలో ఆయన ఇంకా ఎలాంటి యాక్షన్ సీక్వెన్స్‌లు కంపోజ్ చేస్తారా అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles