సరిపోదా శనివారం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ ఎప్పుడు..ఎక్కడో తెలుసా!

Sunday, December 22, 2024

మిడ్ రేంజ్ హీరోలలో నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం ఫుల్‌ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. వరుస సినిమాలుతో జెట్ స్పీడ్ లో ముందుకు దూసుకెళుతున్నాడు. ప్రస్తుతం నాని నటిస్తున్న సినిమా సరిపోదా శనివారం. ఈ సినిమా ప్రమోషన్స్ లో నాని ఫుల్‌ బిజీబిజీగా ఉన్నాడు. పాన్ ఇండియా భాషలలో తెరకెక్కింది ఈ సరిపోదా శనివారం సినిమా.

ఇటీవల చెన్నై ప్రమోషన్స్ లో భాగంగా  ఈ సినిమా తమిళ ట్రైలర్ ను విడుదల చేశాడు ఈ యంగ్‌ టాలెంటెడ్‌ స్టార్‌ హీరో నాని. అటు కేరళలోని ఓ ఈవెంట్ లో మళయాళ ట్రైలర్ ను విడుదల చేసాడు . నాని కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ లో తెరకెక్కిన సినిమా సరిపోదా శనివారం. ఈ మూవీ ట్రైలర్ కు విశేష స్పందన లభించింది. కాగా సరిపోదా శనివారం ప్రీ రిలీజ్ ఈవెంట్ ను భారీ స్థాయిలో నిర్వహించనున్నారు చిత్ర బృందం. ఈ నెల 24న హైదరాబాద్ లోని నోవాటెల్ లో సాయంత్రం 6: 00 గంటలకు నిర్వహించనున్నట్టు అఫీషియల్ పోస్టర్ ని మూవీ టీమ్‌ విడుదల చేసింది.

వారంలో కేవలం శనివారం మాత్రమే విలన్స్ ను వేటాడే హీరో చుట్టూ తిరిగే కథాంశం నేపథ్యంలో ఈ సినిమా రానుంది. వివేక్ ఆత్రేయ డైరెక్షన్‌ లో తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 29న వరల్డ్ వైడ్ గా థియేటర్లలో విడుదల కానుంది. తమిళ నటుడు ఎస్‌జే సూర్య ఈ సినిమాలో విలన్ పాత్ర పోషిస్తుండగా తమిళ పొన్ను ప్రియాంక అరుళ్ మోహన్ నానికి జోడిగా నటిస్తుంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles