అఖిల్‌ లేటేస్ట్‌ సినిమా టైటిల్‌ ఏంటో తెలుసా..!

Tuesday, January 21, 2025

అక్కినేని మూడోతరం హీరోల్లో అయ్యగారు అని పిలుచుకునే హీరో అక్కినేని అఖిల్‌. చాలా కాలం నుంచి హిట్ కోసం పట్టువదలని విక్రమార్కుడిలా అఖిల్‌ ప్రయత్నిస్తూనే ఉన్నాడు. సినిమా తరువాత సినిమా చేస్తూనే ఉన్నాడు. కానీ తనకు మాత్రం సరైన బ్రేక్ రాలేదు. 9 ఏళ్ల సినీ కెరీర్‌ లో అఖిల్‌ హిట్‌ అయిన సినిమా అంటే చెప్పలేని స్థితి ఉంది.

అలా అని అఖిల్ పెర్ఫామర్ కాదా అంటే అలా ఏమి కాదు..కెరీర్ స్టార్టింగ్ నుండి టాప్ డైరక్టర్ల దర్శకత్వంలో సినిమాలు చేస్తున్నాడు అఖిల్‌. కాని వేటికవే పోటి పడిమరీ ఫ్లాప్ లుగా నిలిచాయి. ఇక సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఏజెంట్ సినిమా అయితే మొదటి ఆట నుండే వాష్ అవుట్ అయిపోయింది. కొద్దోగొప్పో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌ కొంచెం ఉపశమనం ఇచ్చింది. ఏజెంట్ సినిమా తర్వాత కాస్త సినిమాలకు గ్యాప్ ఇచ్చి ‘ధీర’ అనే సినిమాలో యాక్ట్ చేస్తున్నాడు అఖిల్‌.

ఈ సినిమాతో పాటు మరో సినిమాకు కూడా తాజాగా పచ్చజెండా ఊపాడు ఈ యంగ్‌ హీరో. . కిరణ్ అబ్బవరం హీరోగా వచ్చిన వినరో భాగ్యం విష్ణు కదా సినిమాకు దర్శకత్వం వహించిన మురలీ కిషోర్ అబ్బూరి అఖిల్ తో ఓ సినిమాను రూపొందించబోతున్నాడు. కాగా ఈ సినిమాకు ‘లెనిన్’ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు సమాచారం. ఈ సినిమాను అక్కినేని నాగ చైతన్య, నాగార్జున మనం ఎంటర్ ప్రైజస్ బ్యానర్ పై నిర్మించనున్నట్లు సమాచారం. మరి ఈ సినిమాతో అయినా అఖిల్ సాలిడ్ హిట్ కొట్టాలని అక్కినేని అభిమానులు ఎంతగానో కోరుకుంటున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles