తుంబాడ్” దర్శకుడు భారీ సిరీస్ అఫీషియల్ టైటిల్ ఏంటో తెలుసా!

Saturday, September 7, 2024

మన భారతీయ సినీ మూవీ లవర్స్ లో తాము చూసిన కొన్ని ది బెస్ట్ ఇండియన్ సినిమాల లిస్ట్ చెప్పమంటే అందులో గ్యారెంటీగా ఉండే సినిమా పేరు “తుంబాడ్”. బాలీవుడ్ దర్శకుడు రాహి అనీల్ బార్వే తెరకెక్కించిన ఈ హారర్ ఫాంటసీ థ్రిల్లర్ సినిమాని మూవీ లవర్స్ అంతా ఒక అండర్ రేటెడ్ జెమ్ అని పిలుస్తారు.

మరి ఇలాంటి సినిమాని అందించిన దర్శకుడు నుంచి వస్తున్నా నెక్స్ట్ ప్రాజెక్ట్ అంటే అందరిలో మరింత ఆసక్తి  ఏర్పడింది.అలా గత కొన్ని రోజులు నుంచి సినీ వర్గాల్లో గట్టిగా తన నెక్స్ట్ ప్రాజెక్ట్ పై  సరికొత్త బజ్ వినిపిస్తుంది. మరి ఈసారి తాను భారీ తారాగణం సమంత, వామికా గబ్బి, అలీ ఫజల్ లాంటి వారితో ది ఫ్యామిలీ మ్యాన్ సిరిస్‌  దర్శకులు రాజ్ అండ్ డీకే లతో క్రేజీ వెబ్ సిరీస్ ని చేస్తున్నట్టుగా టాక్‌ వినిపిస్తుంది. ఇప్పుడు ఫైనల్ గా ఈ సిరీస్ పై సాలిడ్ అప్డేట్ తో దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ వారు కూడా వచ్చారు.

గతకొన్ని రోజుల నుంచి వినిపిస్తున్న ఇంట్రెస్టింగ్ టైటిల్ “రక్త్ బ్రహ్మాండ్” అనే పేరుతోనే ఓ ఇంట్రెస్టింగ్ పోస్టర్ ద్వారా ప్రకటించారు. ఒక కిరీటం దానిపై కారుతున్న రక్తాన్ని ఇందులో కనిపిస్తుంది. దీంతో ఈ సిరీస్ పట్ల ఇప్పుడు భారీ అంచనాలు నెలకొన్నాయి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles