రవితేజ సినిమాలో జగ్గుభాయ్ లుక్‌ ఎలా ఉందో తెలుసా!

Sunday, December 22, 2024

హరీష్ శంకర్ దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ  కాంబోలో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘మిస్టర్ బచ్చన్‌’ లో బిజీయెస్ట్ యాక్టర్స్‌లో ఒకరైన జగపతి బాబు ఓ  కీలక పాత్ర పోషిస్తున్నారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి ఓ అదిరిపోయే లుక్ బయటకు వచ్చింది. అది మరెవరిదో కాదు.. టాలీవుడ్ సీనియర్‌ నటుడు జగపతి బాబుది. జగ్గు భాయ్‌ ఈ సినిమాలో యాక్ట్ చేస్తున్నారనే విషయానని కన్ఫార్మ్‌ చేస్తూ ఆయనకు సంబంధించిన ఫస్ట్‌ లుక్ పోస్టర్‌ ని చిత్ర బృందం విడుదల చేసింది.

తాజాగా చిత్ర బృందం విడుదల చేసిన పోస్టర్‌ లో జగ్గు భాయ్‌ ఇంటెన్స్, ఫెరోషియస్‌ లుక్‌ ఉన్నారు. చేతిలో చదరంగం పావుని పట్టుకుని చాలా సీరియస్‌ గా చూస్తున్నారు.  ‘మిస్టర్ బచ్చన్‌’లో జగపతి బాబు పాత్ర చాలా పవర్ ఫుల్‌గా ఉండబోతుందని ఈ పోస్టర్ ద్వారా తెలుస్తుంది. దర్శకుడు హరీష్ శంకర్, జగపతి బాబు పాత్రని పవర్ ప్యాక్డ్‌గా ప్రజెంట్ చేస్తున్నారనేలా టాక్ వినబడుతోంది. రవితేజ, జగపతిబాబులను తెరపై చూడటం కనుల పండుగగా ఉంటుంది.

ఇద్దరికీ పవర్ ఫుల్ క్యారెక్టర్స్‌ని హరీష్ శంకర్ సెట్ చేశాడనేది ఇప్పటి వరకు విడుదలైన పోస్టర్స్ చూస్తుంటేనే అర్థమవుతోంది. అలాగే జగపతి బాబు ఈ పోస్టర్ షేర్ చేసి.. ‘‘మిస్టర్ బచ్చన్‌లో మాస్ మహారాజాని వేసేయడానికి సిద్ధం’’ అని పోస్ట్ చేస్తే.. అందుకు రవితేజ రియాక్ట్ అవుతూ.. ‘‘మిస్టర్ బచ్చన్ ఇక్కడ.. ఎవరు ఎవర్ని వేస్తారో చూసుకుందాం’’ అని ట్వీట్ చేశారు.

రవితేజ సరసన భాగ్యశ్రీ బోర్సే  కథానాయికగా నటిస్తోన్న ఈ చిత్ర టీమ్ 50 రోజుల షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇప్పటివరకు దాదాపు 80 శాతం ప్రొడక్షన్ వర్క్ పూర్తయిందని.. మిగిలిన పనులను త్వరగా పూర్తి చేసి వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. 

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles