టైమ్ ఉందా డార్లింగ్! పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే దర్శకుడు మారుతి డైరెక్షన్‌లో ‘ది రాజా సాబ్’ చిత్రాన్ని రిలీజ్‌కు రెడీ చేస్తున్న ప్రభాస్, మరో డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో ‘ఫౌజీ’ చిత్రంలో నటిస్తున్నాడు.
ఇక ఈ సినిమాల తర్వాత దర్శకుడు సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్‌లో ‘స్పిరిట్’ అనే సినిమాలో ప్రభాస్ నటించబోతున్నాడు. ఈ సినిమాపై అనౌన్స్‌మెంట్ నుంచే భారీ హైప్ క్రియేట్ అయ్యింది. ఇక ఈ సినిమాలో ప్రభాస్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు. అయితే, ఈ సినిమా కోసం ప్రభాస్ పూర్తి ఫిజిక్‌లోకి రానున్నాడు.
కాగా, ఈ సినిమా షూటింగ్‌ను మే నెల చివరినాటికి ప్రారంభించేందుకు మేకర్స్ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. అంటే దాదాపు మూడు నెలల సమయం ప్రభాస్‌కు దొరికినట్లు అయ్యింది. ఈ గ్యాప్‌లో ప్రభాస్ వర్కవుట్స్ చేసి సాలిడ్ ఫిజిక్‌కి రావడం ఖాయమని తెలుస్తోంది. మరి స్పిరిట్ చిత్రం కోసం ప్రభాస్ ఎలాంటి లుక్‌లోకి వస్తాడా అనేది చూడాలి