రజినీ పై డైరెక్టర్ సెన్సేషనల్‌ కామెంట్స్‌!

Sunday, January 26, 2025

సూపర్ స్టార్ రజనీకాంత్‌ పై దర్శకుడు కె.ఎస్‌.రవికుమార్‌ చేసిన నెగిటివ్ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అసలు రజనీకాంత్‌ గురించి కె.ఎస్‌.రవికుమార్‌ ఏం అన్నారంటే.. తమ ఇద్దరి కాంబోలో వచ్చిన ‘లింగ’ సినిమా ఎడిటింగ్‌లో రజనీకాంత్‌ జోక్యం చేసుకున్నారని, అందువల్లే ఆ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదని చెప్పుకొచ్చారు.

ఓ యూట్యూబ్‌ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రవికుమార్‌ ఈ విషయం గురించి మాట్లాడుతూ.. ‘లింగ ఎడిటింగ్‌ విషయంలో రజనీ కలగజేసుకున్నారు. సీజేఐ (కంప్యూటర్‌ గ్రాఫిక్స్‌)కు నాకు ఏమాత్రం టైమ్ ఇవ్వలేదు

ముఖ్యంగా లింగ సెకండాఫ్‌ మొత్తాన్ని ఆయన మార్చేశారు. అదేవిధంగా అనుష్కతో ఉండే ఒక పాట, క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్‌ను కూడా రజనీ తీయించేశారు. పైగా కృతిమంగా ఉండే బెలూన్‌ జంపింగ్‌ సీన్‌ కలిపారు. మొత్తానికి ‘లింగ’ను గందరగోళం చేసేశారు’’ అంటూ రవికుమార్‌ చెప్పుకొచ్చారు.

ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. అసలు ఆయన ఈ కామెంట్స్ చేయడానికి ముఖ్య కారణం ఆయనకు ప్రస్తుతం సినిమా అవకాశాలు లేకపోవడమే. ఆ బాధలోనే ఆయన ఇలా మాట్లాడుతున్నారని తెలుస్తుంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles