అసలు అనుకోలేదు!

Wednesday, January 22, 2025

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ఇప్పుడు దర్శకుడు మారుతీ సినిమాతో పాటు మరికొన్ని సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉన్నాడు.  మరి ఈ సినిమా షూటింగ్ శరవేగంగా కూడా జరుగుతుంది. అయితే ప్రభాస్ చేతిలో మరిన్ని సినిమాలు లైన్ లో ఉన్నాయి. అయితే ఈ సినిమాల్లో క్రేజీ ప్రాజెక్ట్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగతో చేయనున్న ఫుల్లీ యాక్షన్ సినిమాల్లో “స్పిరిట్” కూడా ఒకటని చెప్పుకొవచ్చు.

మరి దీనిపై డబుల్ హైప్ కూడా ఉంది. ఇక ఈ సినిమా విషయంలో ఇంట్రెస్టింగ్ బజ్ ఒకటి వినపడుతుంది. దీని ప్రకారం ప్రభాస్ ఇప్పటి వరకు ఎవరూ ఊహించని లుక్ లో కనిపించబోతున్నట్లు సమాచారం. ఆల్రెడీ సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ కోసం ఓ స్పెషల్ లుక్ ని లాక్ చేయగా ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న రాజా సాబ్ తర్వాత ఆ లుక్ లోకి ఛేంజ్‌ అవ్వనున్నట్లుగా తెలుస్తుంది.

అలాగే ఈ లుక్ తోనే ఈ ఒక్క సినిమా కంప్లీట్ చేశాకే ప్రభాస్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ లోకి వెళ్తాడని తెలుస్తుంది. మరి మొత్తానికి మాత్రం ఈ వైలెంట్ కాంబోలో సినిమా చాలా జాగ్రత్తగానే ప్లాన్ చేస్తున్నారని చెప్పుకొవచ్చు

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles