ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తాజాగా నటించిన భారీ పాన్ ఇండియా చిత్రం పుష్ప 2 ది రూల్ లో రికార్డు వసూళ్లు తాను కొల్లగొడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా సక్సెస్ తో అల్లు అర్జున్ సహా చిత్ర యూనిట్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. అయితే ఈ సినిమా తర్వాత సుకుమార్ కొంచెం లాంగ్ గ్యాప్ తీసుకోబోతున్నారు. కానీ అల్లు అర్జున్ మాత్రం ఎక్కువ గ్యాప్ తీసుకోవట్లేదంట.
ఇలా తన నెక్స్ట్ సినిమా కోసం కేవలం రానున్న రెండు మూడు నెలల్లోనే సిద్ధం అవుతున్నట్లు టాక్ నడుస్తుంది. నెక్స్ట్ ఐకాన్ స్టార్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో భారీ పాన్ ఇండియా సినిమా చేయనున్నట్లు టాక్ నడుస్తుంది. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు ఆల్రెడీ జరుగుతుండగా షూటింగ్ కూడా వచ్చే ఏడాది మార్చ్ లో మొదలు పెట్టేయబోతున్నారంట. దీనితో ఐకాన్ స్టార్ పెద్దగా గ్యాప్ తీసుకునేలా కనిపించడం లేదు.