మరో సినిమాకి ఓకే చెప్పాడా!

Sunday, December 22, 2024

మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ తాజాగా ‘లక్కీ భాస్కర్’ సినిమాతో బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సినిమాకు దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వం వహించగా ఈ సినిమా కంటెంట్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా కలెక్షన్స్ పరంగా కూడా సాలిడ్ వసూళ్లు అందుకుంటోంది.

ఈ సినిమాతో దుల్కర్ సల్మాన్ టాలీవుడ్‌లో లక్కీ హీరోగా మారిపోయాడు. ఆయనతో సినిమా చేస్తే కచ్చితంగా హిట్ అవుతుందని మూవీ మేకర్స్ అనుకుంటున్నారు. ఇప్పుడు ఈ క్రమంలోనే దుల్కర్ సల్మాన్ తన నెక్స్ట్ మూవీని ఇప్పటికే లాంచ్ చేశాడు. తమిళ, తెలుగు భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రానా దగ్గుబాటి, భాగ్యశ్రీ కూడా యాక్ట్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఇప్పుడు మరో రెండు స్ట్రెయిట్ తెలుగు సినిమాలకు దుల్కర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

ఇందులో మొదటి సినిమాను నవంబర్ చివరినాటికి ప్రకటించి, పట్టాలెక్కించాలని చూస్తున్నారంట. ఓ టాప్ తెలుగు డైరెక్టర్ ఈ సినిమాను తెరకెక్కిస్తుండగా భారీ బడ్జెట్ మూవీగా ఇది రానున్నట్లు తెలుస్తోంది. మరి దుల్కర్ ఓకే చెప్పిన ఈ తెలుగు సినిమా ఏంటో తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles