పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస చిత్రాలను రిలీజ్‌కు రెడీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయన నుంచి రాబోతున్న సినిమాల్లో ‘హరిహర వీరమల్లు’, ‘ఓజి’ ఇప్పటికే మెజారిటీ షూటింగ్ పూర్తి చేసుకున్నాయి. ఈ రెండింట్లో ‘హరిహర వీరమల్లు’ కొద్ది రోజుల షూటింగ్ మాత్రమే మిగిలి ఉండటంతో ఈ సినిమా విడుదల ఎప్పటికప్పుడే వాయిదా పడుతూ వస్తోంది.
ఇక ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో మేకర్స్ ఓ క్లారిటీకి రాబోతున్నట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు తో పాటు ఓజి చిత్రాల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో మేకర్స్ ఇప్పుడు వీలైనంత త్వరగా ఈ సినిమాలను పూర్తి చేసి విడుదలకు సిద్ధమవ్వాలని చూస్తున్నారట. ఇక వీరమల్లు చిత్రంలో పవన్ చేయాల్సిన షూటింగ్ కొంతనే ఉండటంతో ఈ సినిమాను మే 2వ వారంలో లేదా 4వ వారంలో రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోందట.
ఈ సినిమాలో పవన్ పాత్ర ప్రేక్షకులను స్టన్ చేయడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమాగా ఉంది.
