పవన్ తేదీలిచ్చారా? ట్విస్ట్ ఇచ్చిన “మార్కో” విలన్!

Tuesday, December 9, 2025

టాలీవుడ్ పవర్ స్టార్  పవన్ కళ్యాణ్ ఇపుడు పలు భారీ సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాల్లో డైరెక్టర్‌ జ్యోతి కృష్ణ తెరకెక్కిస్తున్న భారీ మూవీ “హరి హర వీరమల్లు” కూడా ఒకటి. అయితే ఈ మూవీ షూటింగ్ ఇపుడు చివరి దశలో ఉంది. అయితే పవన్ నుంచి ఇంకా కావాల్సింది నాలుగు రోజుల డేట్స్ మాత్రమే అని సమాచారం.

మరి ఈ నాలుగు రోజులు ఎప్పుడు ఇస్తారు అనేది పెద్ద సస్పెన్స్ గా మారగా ఇపుడు “మార్కో” సినిమా విలన్ నటుడు కబీర్ దుహన్ సింగ్ తాను వీరమల్లు షూట్ సెట్స్ లో చివరి షెడ్యూల్ కోసం జాయిన్ అయ్యినట్టుగా ఓ అప్డేట్‌ బయటకు రాగా ఇది వైరల్ గా మారింది. మరి దీంతో పవన్ కూడా తేదీలు ఇచ్చారా, షూటింగ్ ఎట్టకేలకి కంప్లీట్ అవుతుందా అని టాక్ మొదలైంది.

మరి ఈ ఒక్క సినిమాని ప్రస్తుతం పూర్తి చేసేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. మరి చూడాలి ఈ సినిమా ఎపుడు పూర్తవుతుంది అనేది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles