ఓజీ షూటింగ్‌ మొదలు పెట్టేది అప్పుడేనా?

Wednesday, January 22, 2025

పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్‌ చేతిలో ప్రస్తుతం చాలా సినిమాలున్నాయి. నిన్నటి వరకు ఏపీ ఎన్నికల్లో భాగంగా ఆయన ఫోకస్‌ అంతా ఎన్నికల మీదే ఉంచారు. ఎన్నికలు ముగిశాయి. దీంతో పవన్ త్వరలోనే మేకప్‌ వేసుకునేందుకు సిద్ధం అవుతున్నాడని తెలుస్తుంది.  ఇక నుంచి పవన్  వరుస షూటింగ్స్ తో బిజీ కానున్నట్లు  సమాచారం.

పవన్‌ కల్యాణ్‌ లైనప్ లో ఓజీ, ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ మరియు హరిహరవీరమల్లు వంటి సినిమాలు ఉన్నాయి .అయితే ముందుగా సాహో ఫేం సుజిత్‌ దర్శకత్వం వహిస్తున్న”ఓజి” షూటింగ్‌ను జూన్‌ చివరలో మొదలు పెట్టబోతున్నట్లు సమాచారం.  అయితే దీని గురించి చిత్ర యూనిట్ నుండి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఈ సినిమాలో పవన్ పవర్ఫుల్ గ్యాంగ్ స్టర్ గా కనిపించనున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్‌ చేసిన గ్లింప్స్ నెట్టింట బాగా వైరల్ గా మారింది. అయితే ఈ చిత్రాన్నిసెప్టెంబర్‌ 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానున్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు. దీంతో శరవేగంగా షూటింగ్ పూర్తి చేయాలనీ దర్శకుడు సుజీత్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles