కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన తాజా సినిమా కూలీ బాక్సాఫీస్ దగ్గర మంచి హంగామా చేస్తోంది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ రివ్యూల పరంగా మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ వసూళ్లలో మాత్రం గట్టి స్థాయిలో దూసుకెళ్తోంది. ప్రస్తుతం వరల్డ్‌వైడ్ కలెక్షన్స్ 500 కోట్ల మార్క్ వైపు దూసుకెళ్తున్నాయి.
ప్రత్యేకంగా తెలుగు వెర్షన్ విషయానికి వస్తే, రెండు రాష్ట్రాల్లో మరియు ఓవర్సీస్‌లో కలిపి ఈ సినిమా 80 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసిందని తాజా లెక్కలు చెబుతున్నాయి. జైలర్ తర్వాత రజినీకాంత్ కెరీర్‌లో మరోసారి ఇంత భారీ కలెక్షన్ రావడం గమనించదగ్గ విషయం. అయితే జైలర్ లాంటి స్ట్రాంగ్ పాజిటివ్ టాక్ ఈ సినిమాకి కూడా దక్కి ఉంటే, తెలుగు వెర్షన్‌లో జైలర్ రికార్డ్స్‌ని సులభంగా అధిగమించే అవకాశం ఉండేదని ఫిల్మ్ సర్కిల్స్ అభిప్రాయపడుతున్నాయి.
