ధూం ధాం విడుదల తేదీ వచ్చే

Wednesday, January 22, 2025

యంగ్ హీరో చేతన్‌ కృష్ణ, హెబ్బా పటేల్ హీరో హీరోయిన్లుగా డైరెక్టర్ సాయి కిషోర్ మచ్చా ఒక పండుగలా తెరకెక్కించిన పక్కా ఎంటర్టైనర్ మూవీ “ధూం ధాం”. ఈ సినిమాలో ప్రముఖ నటులు సాయి కుమార్, వెన్నెల కిషోర్, పృథ్వీరాజ్, గోపరాజు రమణ ముఖ్య పాత్రల్లో నటించిన ఈ కలర్ ఫుల్ సినిమాకి మేకర్స్ సాలిడ్ ప్రమోషన్స్ కూడా మొదలు పెట్టేశారు.

అయితే ఈ సినిమా ఇది వరకే విడుదల కావాల్సి ఉంది. కానీ కొంతమేర ఎంటర్టైన్మెంట్ ని వాయిదా వేశారు. మరి ఇప్పుడు ఫైనల్ గా విడుదల తేదీని ప్రకటించారు. దీంతో ఈ సినిమా నవంబర్ 8న విడుదల చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేసారు. సో ఈ పండుగ లాంటి ఎంటర్టైనర్ నవంబర్ లో మొదలు అవుతుందని చెప్పాలి. ఇక ఈ సినిమాని సక్సెస్ ఫుల్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ మైత్రి మూవీ డిస్ట్రిబ్యూషన్ ఎల్ ఎల్ పి వారు విడుదల చేస్తున్నారు. ఇక ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కి గోపి సుందర్ సంగీతం అందించగా ఫ్రైడే ఫ్రేమ్ వర్క్స్ వారు నిర్మాణ బాధ్యతలు చేపట్టారు..

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles