ధూం..ధాం నుంచి అదిరిపోయే కుందనాల బొమ్మ సాంగ్‌ వచ్చేస్తుంది!

Sunday, December 22, 2024

టాలీవుడ్ బ్యూటీ హెబ్బా ప‌టేల్ ప్ర‌స్తుతం వ‌రుస‌బెట్టి సినిమాలు చేస్తూ ఫుల్‌ బిజీబిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఆమె న‌టిస్తున్న తాజా సినిమా ”ధూం ధాం” ప్రేక్ష‌కుల్లో మంచి పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా నుంచి విడుదలైన పోస్ట‌ర్స్, సాంగ్స్ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకోవ‌డంలో ఫుల్‌ స‌క్సెస్ అయ్యాయి.

ఇక ఈ సినిమా నుంచి తాజాగా మ‌రో అప్డేట్ ఇచ్చింది చిత్ర బృందం. ఈ సినిమాలోని నెక్ట్స్ సింగిల్ సాంగ్ ‘కుంద‌నాల బొమ్మ’ను ద‌ర్శ‌కేంద్రుడు కె.రాఘ‌వేంద్ర రావు చేతులు మీదుగా లాంచ్ చేయబోతున్నారు. ఈ పాట‌ను ఆగ‌స్టు 7న ఉద‌యం 10.45 గంట‌ల‌కు విడుదల చేయబోతున్నట్లు సమాచారం.

ఈ సినిమాలో చేత‌న్ కృష్ణ హీరోగా చేస్తుండగా సాయి కుమార్, వెన్నెల కిషోర్, విన‌య్ వ‌ర్మ ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఈ సినిమాకు గోపీసుంద‌ర్ సంగీతం అందిస్తుండ‌గా ఎం.ఎస్.రామ్ కుమార్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమాని మ‌చ్చ‌సాయి కిషోర్ డైరెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles