సందీప్ డైరెక్షన్ లో ధోనీ! ఇండియన్ ఆడియెన్స్ లో అత్యధికంగా ఎంటర్టైన్మెంట్ అందించిన బిగ్గెస్ట్ ప్లాట్ ఫామ్ లలో ఒకటి సినిమా అయితే మరొకటి క్రికెట్ అనే చెప్పాలి. మరి మొన్ననే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ కూడా పూర్తయ్యింది. ఇక నెక్స్ట్ అంతా ఐపీఎల్ సీజన్ కోసం ఎదురు చూస్తున్నారు. మరి ఈ సీజన్ కోసం అనేకమంది స్టార్ ప్లేయర్స్ సిద్ధం అవుతుండగా వారిలో స్టార్ క్రికెటర్ ఎంఎస్ ధోని కూడా ఒకరు.
మరి ధోని ఈ ఐపిఎల్ కంటే ముందు సెన్సేషనల్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో కనిపించడం ఇపుడు కేజ్రీగా మారింది. అయితే ఇది సినిమా కోసం కాదు కానీ ఒక యాడ్ కోసం కలిశారు. మరి ఇందులో సందీప్ రెడ్డి వంగ అనిమల్ హీరో రన్బీర్ సింగ్ ని దింపెయ్యడం గమనార్హం.
ఆ డ్రెస్సింగ్ సహా హెయిర్ స్టయిల్ కూడా ఆ సినిమాలో చూపించినట్టే ఇంకా ఇద్దరి నడుమ మంచి ఫన్ మాటలు, ఇక ఫైనల్ గా రన్బీర్ సిగ్నేచర్ స్టెప్ ని ధోనితో చేయించడం ఇపుడు సోషల్ మీడియాలో ఫ్యాన్స్ నడుమ ఓ రేంజ్ లో వైరల్ గా మారిపోయింది.