రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఇటీవల విడుదల చేసిన కింగ్డమ్ సినిమా ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన పొందింది. ఈ చిత్రాన్ని గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందించగా, యాక్షన్ అండ్ డ్రామా కలయికగా ఉన్న ఈ మూవీ కొంతవరకు ఆడియెన్స్‌ను ఆకట్టుకుంది. అయితే, విజయ్ అభిమానులు మాత్రం ఇంకా అతడినుంచి సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్నారు.
ఇప్పుడు విజయ్ దేవరకొండ తన కొత్త సినిమాకు సిద్ధమవుతున్నాడు. ఈసారి అతడు స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు సొంత బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌లో చేయబోతున్నాడు. ఈ ప్రాజెక్ట్ ఆ బ్యానర్‌లో 59వ చిత్రంగా నిలవనుంది. సినిమా లాంఛనంగా ప్రారంభం కానుండగా, ఈ కాంబినేషన్‌పై ఇప్పటికే ఇండస్ట్రీలో మంచి బజ్ ఏర్పడింది.
