ఫస్ట్‌ సాంగ్‌ తో వస్తున్నాం అంటున్న దేవర టీమ్!

Wednesday, January 22, 2025

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. అటు దేవర, ఇటు వార్‌ 2 సినిమాల చిత్రీకరణలో తారక్‌ ఫుల్‌ బిజీగా ఉన్నాడు. అయితే ఈ నెల 20 తారక్‌ పుట్టిన రోజు.దీంతో ఈ రెండు సినిమాల నుంచి ఏమైనా అప్డేట్‌ వస్తుందేమో అని తారక్‌ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.  

అయితే దేవర మూవీ టీం ఎన్టీఆర్ బర్త్ డే కు స్పెషల్ ట్రీట్ ఇవ్వనున్నట్లు కొద్ది రోజుల క్రితం చిత్ర బృందం ట్వీట్ చేసింది. అయితే తాజాగా మ్యూజిక్ ఛానల్ అయిన టీ సిరీస్ సౌత్ “వస్తున్నాం” అంటూ దేవర వీడియో క్లిప్ తో పాటు మ్యూజిక్ సింబల్స్ ను కూడా ట్విట్టర్ లో పెట్టింది. దీంతో  దేవర ఫస్ట్ సాంగ్ టీ సీరిస్‌ సౌత్‌ లో ఎన్టీఆర్ పుట్టిన రోజున విడుదల అవుతుందని ఓ క్లారిటీ వచ్చింది. ఎన్టీఆర్ అభిమానులు ఈ ట్వీట్ తో సంబరాలు చేసుకుంటున్నారు.

అలాగే దేవర సినిమాతో పాటు, వార్ 2 సినిమా నుంచి ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ పోస్టర్ అలాగే ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ సినిమా కాంబో లో వస్తున్నమూవీ నుంచి కూడా స్పెషల్ అప్డేట్ వస్తుంది అని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles