దేవర స్పెషల్‌ షోకి జక్కన్న!

Tuesday, January 21, 2025

చాలా రోజులు తర్వాత మన టాలీవుడ్ నుంచి వచ్చిన మోస్ట్‌ అవైటెడ్ సినిమా “దేవర”. మ్యాన్ ఆఫ్ మాసెస్, యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా సినిమా “దేవర” . మరి తారక్ నుంచి దాదాపు 3 సంవత్సరాల తర్వాత వచ్చిన సోలో మూవీ ఇది కాగా అభిమానుల్లో అంచనాలు కూడా అదే స్థాయిలో నెలకొన్నాయి.

మరి గ్రాండ్ గా నేడు థియేటర్స్ లోకి వచ్చిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో అయితే అర్ధ రాత్రి నుంచే థియేటర్స్ లో సందడి చేస్తుంది.
మరి ఈ స్పెషల్ షోని ఎన్టీఆర్ అభిమాన దర్శకుడు,  ప్రైడ్ ఇండియా డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి స్పెషల్ స్క్రీనింగ్ చూసినట్టుగా సమాచారం.

రాజమౌళి సహా తన సతీమణి రమా రాజమౌళి కూడా కలిసి  దేవర స్పెషల్ షో చూసారు. దీంతో పలు విజువల్స్ కూడా అభిమానుల్లో వైరల్ గా మారాయి. ఇక ఈ భారీ చిత్రానికి అనిరుద్ క్రేజీ స్కోర్ ని అందించగా థియేటర్స్ లో అతని మ్యూజిక్‌ కి అభిమానుల సందడి తోడయ్యి బ్రహ్మాండం దద్దరిల్లుతుంది. మరి తారక్ కూడా తన అభిమానులకి మంచి ఫీస్ట్ ని అందించి అదరగొట్టాడనే చెప్పవచ్చు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles