దేవర ముంగిట యానిమల్‌!

Sunday, December 22, 2024

ట్రిపుల్‌ ఆర్‌ తరువాత జూనియర్‌ ఎన్టీఆర్‌ నటిస్తున్న చిత్రం దేవర ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ అన్నయ్య  కళ్యాణ్ రామ్ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. నిజానికి రాజమౌళితో సినిమా చేసిన తర్వాత ఏ సినిమా అయినా ఆ హీరోకి డిజాస్టర్ అవుతుందనే నిజం ఇండస్ట్రీలో నడుస్తుంది.

ఇప్పుడు ఆ సెంటిమెంట్ ని బ్రేక్ చేయడానికి కొరటాల శివతో పాటు జూనియర్ ఎన్టీఆర్ కూడా చాలా కష్టపడుతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాలో చాలామంది స్టార్ కాస్ట్ ని డైరెక్టర్‌ రెడీ చేసిన సంగతి తెలిసిందే. హీరోయిన్‌ గా బాలీవుడ్‌  జాన్వీ కపూర్ యాక్ట్‌ చేస్తుండగా విలన్ గా సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నాడు.

అలాగే చాలామంది టాలెంటెడ్ నటీనటులు కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు. తాజాగా మరో ఆసక్తికరమైన వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది. అదేంటంటే ఈ సినిమాలో మరో విలన్నీ కూడా ఎంటర్‌  చేయబోతున్నట్లు సమాచారం. ఇటీవల యానిమల్ సినిమాతో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న బాబీ డియోల్ ని ఈ సినిమాలో మరో విలన్ గా దింపుతున్నట్లుగా తెలుస్తోంది. నిజానికి బాబీ డియోల్ ఇప్పటికే పలు తెలుగు ప్రాజెక్టుల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే.

హరిహర వీరమల్ల సినిమాతో పాటు బాలకృష్ణ, దర్శకుడు బాబీ కాంబోలో రాబోతున్న సినిమాలో కూడా నటిస్తున్నాడు. ఇప్పుడు ఎన్టీఆర్ సినిమాలో కూడా ఆయన్ని ద్వితీయ భాగానికి మెయిన్ విలన్ గా తీసుకోబోతున్నట్లుగా సమాచారం.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles