గోవాలో షూటింగ్‌ తో బిజీగా ఉన్న దేవర!

Wednesday, January 22, 2025

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ తాజాగా నటిస్తున్న చిత్రం దేవర. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ చాలా వేగంగా జరుగుతుంది. ఈ సినిమాలో తారక్‌ చాలా పవర్‌ ఫుల్‌ పాత్రలో చేస్తున్న విషయం తెలిసిందే. కాగా, ఈ సినిమా షూటింగ్ ప్ర‌స్తుతం గోవాలో జ‌రుగుతోంది. గోవాలోని ఓ మారుమూల ప్రాంతంలో ఈ షూటింగ్ జ‌రుగుతున్న‌ట్లుగా  మూవీ మేకర్స్‌ తెలిపారు.  

ప్రస్తుతం సినిమాలోని ప‌లు కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నారు. ఎన్టీఆర్ తో పాటు ప‌లువురు కీల‌క ఆర్టిస్టులు ఈ షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఈ కార‌ణంగానే ‘దేవ‌ర’ చిత్ర యూనిట్ ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత   రామోజీ రావుకి నివాళి అర్పించేందుకు రాలేక‌పోయిన‌ట్లుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్ గా చేస్తుండగా, సైఫ్ అలీ ఖాన్ విల‌న్ పాత్ర‌లో న‌టిస్తున్నాడు. 

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles